Showing posts with label మన తెలుగు కవయిత్రులు - 1. Show all posts
Showing posts with label మన తెలుగు కవయిత్రులు - 1. Show all posts

Saturday, November 10, 2018

మన తెలుగు కవయిత్రులు (మొదటి భాగం)

ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు అన్న మన త్యాగయ్య మాటను గుర్తుకు తెచ్చుకుంటూ మన కవి సార్వభౌముల వివరాలు.

అక్షరమాల అమ్మ నుంచి మొదలవుతుంది కావున మనం మన కవయిత్రులు గురించి తెలుసుకుందాం.

ఆతుకూరి మొల్ల  (కవయిత్రి మొల్ల)
కుప్పాంబిక
తరిగొండ వెంగమాంబ
తాళ్ళపాక తిరుమలమ్మ
నాయని కృష్ణ కుమారి
అబ్బూరి ఛాయాదేవి

ఆతుకూరి మొల్ల  (కవయిత్రి మొల్ల)  :

మొల్ల అసలు పేరు ఆతుకూరి మొల్ల, కవితా రచనలతో ఈమె కు కవయిత్రి మొల్ల అని పేరు వచ్చింది. ఈమె 1440 వ సంవత్సరం లో కడప జిల్లా గోపవరం అను ప్రదేశం లో పుట్టింది. మొల్ల కలం పేరు మొల్లమాంబ. వీరు సంస్కృతం నుంచి రామాయణాన్ని అనువదించిన వారిలో తొలి తెలుగు మహిళా.వీరు రచించిన రామాయణాన్ని మొల్ల రామాయణం అంటారు. వీరు కవి రత్న బిరుదాంకితులు. వీరు 1530 వ సంవత్సరం లో కాలం చేసారు.

వీరు రాసిన రామాయణం నుంచి ఒక పద్యం.

సుడికొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్పడనొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పాదరేణు వి
య్యెడవడి నోడసోక నది యెట్లగునోయని సంశయాత్ముడై
కడిగె గుహుండు రాముపదకంజ యుగంబు భయంబుపెంపునన్!

భావం:

గుహ, గొప్ప రామ భక్తుడు. శ్రీరాముల వారి పాదము సోకినందు వలన రాయి అహల్య గా మారింది. ఆ పాద ధూళి సోకిన అతని యొక్క పడవను తాకితే ఏమవుతుందో అని సంశయాత్ముడై (ఆలోచనాపరుడై) శ్రీరాముని పాదాలను కడిగాడు అని అర్థం.

అహల్య, గౌతముని భార్య ,చాల సుందరమైన రూపమైనది. దేవేంద్రుడు, దేవతాలోకాధిపతి ఆమెను కాంచి మోహించదలచాడు. అహల్య వేరొకరి భార్య అయినను ఆలోచనా మానక పోవడంచేత కపట తీరున గౌతముడు సూర్య నమస్కార ప్రార్ధనకై స్నానమాచరించడానికి నదికి వెళ్ళాడు. ఆ సమయమున దేవేంద్రుడు గౌతముని రూపములో వారి గృహమునకు వెళ్ళాడు. ఆ మాయ రూపమున ఉన్నది తన భర్త అని భ్రమపడిన  అహల్య దేవేంద్రుని కపట బుద్దిని గ్రహించలేదు. గౌతముడు ప్రార్థనకు ఇంకనూ సమయమున్నదని తలచి స్వగృహమునకు వచ్చి చూడగా మోహితులై ఉన్న దృశ్యమును చూచి, కోపోద్రిక్తుడై అహల్యను శిలగాను, ఇంద్రుని దేహమంతయు రంధ్రములు అవునట్లుగాను శపిస్తాడు. అహల్య నాకు ఏ పాపమూ తెలియదని వేడుకొనగా నీవు రాముని పాదమును సోకినప్పుడు నిజరూపము ప్రాప్తిస్తుందని సెలవిస్తాడు.

ఇలా అహల్య శిలా గా మారి, శ్రీరాముని పాదస్పర్శ తో యువతిగా మారుతుంది. ఆ సందర్భాన్ని మొల్లగారు పద్యరూపంగా చక్కగా వర్ణించారు.



ఇలా ఎందరో మన తెలుగు గడ్డ మీద పుట్టిన కవయిత్రులు, వారిలో మా పాఠ్యాంశాల్లో నేను చదివిన వారి గురించి చెప్పదలచు కున్నాను ఈ వ్యాఖ్యానం లో.

మిగతావారి గురించి కింద పేర్కొన్న లింక్ నుండి తెలుసుకోగలరు.


జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...