Showing posts with label Telugu Aksharalu. Show all posts
Showing posts with label Telugu Aksharalu. Show all posts

Wednesday, November 28, 2018

తెలుగు అక్షరాలు

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, గ్గ్ట్ పొల్లు, నిండు సున్న, వెరసి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

అచ్చులు


  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను   హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు     -  రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు.   ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు    -  ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును.ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.


హల్లులు 

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.



  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.

క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ

చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ

ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ

త వర్గము - త, థ, ద, ధ, న

ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
           సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
           సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

గుణింతాలు

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు.

అచ్చులుఆకారము( లేక ) గుర్తునామములుగుణింతముచదువుట నేర్చుకొనుట
అకారముక్+అ=కకకార అకరముల క
ఆకారముక్+ఆ=కాకకార ఆకరముల కా
ిఇకారముక్+ఇ=కికకార ఇకరముల కి
ఈకారముక్+ఈ=కీకకార ఈకరముల కీ
ఉకారముక్+ఉ=కుకకార ఉకరముల కు
ఊకారముక్+ఊ=కూకకార ఊకరముల కూ
ఋకారముక్+ఋ=కృకకార ఋకరముల కృ
ౠకారముక్+ౠ=కౄకకార ౠకరముల కౄ
ఎకారముక్+ఎ=కెకకార ఎకరముల కె
ఏకారముక్+ఏ=కేకకార ఏకరముల కే
ఐకారముక్+ఐ=కైకకార ఐకరముల కై
ఒకారముక్+ఒ=కొకకార ఒకరముల కొ
ఓకారముక్+ఓ=కోకకార ఓకరముల కో
ఔకారముక్+ఔ=కౌకకార ఔకరముల కౌ
అంపూర్ణానుస్వారముక్+ం=కంకకార పూర్ణానుస్వారము కం
అఃవిసర్గక్+ః=కఃకకార విసర్గ కః
గుణింతము
అచ్చులుఅంఅః
అకారముల
గుర్తు
ి
అకారముల
ఉచ్చారణ
అ కారముఆ కారముఇ కారముఈ కారముఉ కారముఊ కారముఋ కారముౠ కారముఎ కారముఏ కారముఐ కారముఒ కారముఓ కారముఔ కారముపూర్ణాను స్వారమువిసర్గం

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

 కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.




జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...