Sunday, May 9, 2021

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి 

హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి 


మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది 

వీర్యపు  కణమై  కడుపునా  పడుతూ  

నెల  నెల  ఎదిగిన  ఓ  శిశువా.. 

తనువే  తొడిగి  భువిలో  పడుతూ 

తెలియని  పుట్టుక  నీది  కదా 


పూర్వ  జన్మాల  స్మృతిని  మరిచిపోయావు  మానవా 

మాయ  నిన్నవరించి  నడక  నేర్చావు  మెల్లగా ..

పసలేని  అజ్ఞాన  విద్యలే  నేర్చి  గర్వపడతావురా .

ఈ  రక్త మాంసాల  దేహమే  చూసి  మురిసిపోతావురా .


వెనువెంట  వస్తున్నా  మృత్యు  పాశాంన్ని  మరిచిపోబోకురా ..

సాగితే  నీ  సరిలేరుఅని  డాంబికం తెగ  పలకకురా..


పీనుగై  మారిన  క్షణమున  కుక్కతో  సమమవ్వురా ..

ధనమే  సుఖమును  భ్రమలో  పడుతూ .

కనులే  కానక  తిరిగేదవా .

తలకు  మోముకు  రంగులు  వేస్తూ ..

కాలం  కన్నులు  మోసెదవా  ..


పోగు చేసిన  లక్షలు  కోట్లు  నిన్ను  బ్రతికించవురా ..

నువ్వు  పొందిన  ఎన్నో  బిరుదులూ  చావు  తప్పించవురా ..

భార్యా  బిడ్డలు  వెంట  వత్తురని  కలలో  కూడా  తలచకురా ..

వదలక  నీతో  వచ్చినా  ఆ  వల్లకాటి  వరకేరా ..


నిన్ను  మోసిన  పల్లకి  చివరికి  నీ  పాడే  అవుతది  ..

నువ్వు  ఉండిన  గృహమే  చివరకు  నిను వెళ్ళమంటది .

నిను  కాల్చివేయు  కట్టెలుగా 

ఓ  చెట్టుకు  రాసి  ఉంటుంది ..


పరిమళాలు  పులుముకున్న  తనువు 

ఈ  మన్ను  కలవక  తప్పదది ..

పోయే  ముందర  కాలం  పక పక పరిహాసమాడుట  తధ్యమది ..


శవమై తిరిగే  తెరలో  శివమా .

నువ్వు ఎరగని  కదా  నీది  కదా .


నెత్తుటి  మాంసపు  ముద్దగా  ఎదిగిన .

కాయం  కూలుట  ఖాయమురా ..


కాబోయే  శవం  నీవు  కదరా  దేహం  పై  మొహం  వదలరా ..

ఇన్నాళ్లు  సాధించింది  ఏది  రా  , నీకోసం  ఏం  చేసావురా !!!

No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...