Sunday, November 11, 2018

పోతన - శ్రీమద్భాగవతం

బమ్మెర పోతానామాత్యులు  



పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!

ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్భాగవతంలోనిది. భాగవతంలో విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన కథలు ఉంటాయి. శ్రీరాముని ఆనతిమేరకు భాగవతాన్ని తెలుగులో రచించానని పోతన చెప్పాడు. అటువంటి గ్రంథాన్ని ప్రారంభిస్తూ పోతన శ్రీరాముని మనసులో ధ్యానించాడు. పద్యం అర్థం: రాస్తున్న కావ్యం భాగవతం. రాయిస్తున్నది శ్రీరామచంద్రుడు. భాగవత కథను చదివితే చాలు జన్మసార్థకం. కనుక వేరే కథ చదివే అవసరం లేదు - అని పై పద్యంలో పోతన వివరించాడు.
ఇందులో ‘పలికెడిది’ అనే పదం ప్రతి పాదంలోనూ ఉంది. దీనివల్ల పద్యం అందంగా ఉండటమే కాకుండా నేర్చుకోవటం కూడా చాలా సులభం. నాలుగు పాదాల్లోనూ ‘పలికెడిది’ అనే పదం ఉంది. కనుక సగం పద్యం వచ్చేసినట్లే. పోతన చాలావరకు తన పద్యాలలో ఇటువంటి ప్రయోగాలు చేశాడు. పోతన గొప్ప ప్రజాకవి, పండితులను, పామరులను మెప్పించే విధంగా భాగవత కావ్యం రచించి తన జన్మను ధన్యం చేసుకున్నాడు. పోతన నేటి వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో జన్మించాడు.


01 - ప్రథమ స్కంధం 02 - ద్వితీయ స్కంధం 03 - తృతీయ స్కంధం 04 - చతుర్థ స్కంధం 05 - పంచమ స్కంధం 06 - షష్ఠ స్కంధం 07 - సప్తమ స్కంధం
ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం

No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...