Sunday, November 11, 2018

07 - సప్తమ స్కంధం

చిత్రంబులు త్రైలోక్య 
విత్రంబులు భవలతాలవిత్రంబులు 
న్మిత్రంబులు మునిజనవన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్

పద విభాగంచిత్రంబులుత్రైలోక్యపవిత్రంబులుభవలతాలవిత్రంబులుసత్మిత్రంబులుమునిజనవనచైత్రంబులువిష్ణుదేవుచారిత్రంబుల్.

భావంశ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావుముల్లోకాలను పవిత్రం చేసేటువంటివిజీవరాసులకు మంచిమిత్రుల వంటివిఅడవులకు వసంత ఋతువు ఆనందం కలిగిస్తుందిఅదేవిధంగా  చరిత్రలు మునులకు ఆనందాన్నికలిగిస్తాయిఇవి సంసార బంధం అనే లతలను అవలీలగా ఛేదించే లవిత్రాలు (కొడవలి వంటివి)... అని శ్రీశుకుడు పరీక్షిత్తుకు వివరించాడు.

బాలున్ హరిపదచింతా
శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా
జాలున్ సంతోషించక
యేలా శిక్షించె రాక్షసేంద్రుండనఘా!

పద విభాగంబాలున్హరిపదచింతాశీలున్సుగుణ + ఆలవాలుశ్రీమత్మేధాజాలున్సంతోషించకఏలాశిక్షించెరాక్షస + ఇంద్రుండుఅనఘా!

భావం: ‘‘ మహర్షీచిన్నారి బాలుడైన  ప్రహ్లాదుడు హరిపాదాల మీదే మనస్సు నిలిపి ఉన్నాడుఅతడు సుగుణశీలుడుతన మనస్సును శ్రీహరి మీదే నిలిపి ఉంచాడుఅందుకు సంతోషించకుండా రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎందుకుశిక్షించాడో కదా!’’ అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.

ఎవ్వడు సృజించు బ్రాణుల
నెవ్వడు రక్షించు ద్రుంచు నెవ్వడనంతుం
డెవ్వడు విభుడెవ్వడు వా
డివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై
పద విభాగంఎవ్వడుసృజించున్ప్రాణులన్ఎవ్వడురక్షించున్త్రుంచున్ఎవ్వడుఅనంతుండుఎవ్వడువిభుడువాడువిధమునమనుచున్పెనుచుహేలారతుడై.
భావం లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడోఎవడు రక్షిస్తాడోఎవడు అంతం చేస్తాడోఎవడు అనంతుడోఎవడు సర్వవ్యాపకుడో...  విభుడే  విధ ంగా పోషించేవాడుపెంచేవాడు (సర్వం చేసేవాడుఅని అర్థం.

No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...