Sunday, November 11, 2018

ఆదికవి, నన్నయ భట్టారకుడు



నన్నయ భట్టారకుడు


మన ఈ తెలుగు గడ్డ మీద చాలామంది కవితా పితామహులు జన్మించారు. వారిలో ఆదికవి, మన తొలి తెలుగు కవి, నన్నయ గారు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. ఈయన తన తెలుగు వ్యాకరణాన్ని అయిదు భాగములుగా విభజించారు.  అవేమనగా సంజ్ఞ , సంధి, అజంతా,హాలంతా మరియు క్రియ. దానికి "ఆంధ్ర శబ్ద చింతామణి" అని వీరు సంస్కృతం లో రాసారు. శబ్ద శాసనుడు మరియు వాగను శాసనుడు బిరుదులను వీరు రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి కి గాను పొందారు. భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు -ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము - తన కింది పద్యంలో ప్రత్యేకముగా చెప్పుకొన్నాడు.

సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారసంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్.

నన్నయ రచించిన చివరిపద్యం (అరణ్యపర్వంలోనిది) - శారదరాత్రుల వర్ణన

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

తాత్పర్యం:
శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు. వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు.

No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...