Friday, November 9, 2018

మా తెలుగు తల్లికి మల్లెపూదండ


తెలుగు తల్లిని తెలంగాణ తల్లి, అమరావతి గా విడగొట్టేసిన రాజకీయాలు. నేను పాఠశాల లో ఉన్నపుడు పలికిన తెలుగు తల్లి వందనం. ప్రాంతమేదైనా భాష తెలుగే గా.. భాష యాస వేరేమో గాని భాషా భావం ఒక్కటే ! మనం ఎప్పటికీ తెలుగు బిడ్డలమే.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరులుతాయి

అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లి !!
జై తెలుగు తల్లి !!

No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...